కృష్ణవంశీ మిస్సింగ్

 

విజయవాడ నగరంలోని సితార సెంటర్ దగ్గర కృష్ణవంశీ అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. విజయవాడ పరిసరాల్లో పిల్లలను ఎత్తుకెళ్ళే ముఠాలు తిరుగుతున్నాయని, పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని పోలీసులు హెచ్చరించి 24 గంటలు గడవకముందే విజయవాడలో ఒక మిస్సింగ్ కేసు నమోదైంది. తమ కుమారుడు కృష్ణవంశీ ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి వెళ్ళి తిరిగి రాలేదని ఆ బాలుడి తల్లిదండ్రులు భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి ఎంత గాలించినా తమ కుమారుడు కనిపించలేదని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని జిఎన్ఆర్ఎంసి పాఠశాలలో కృష్ణవంశీ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu