కథక్ నర్తకి సితారా కన్నుమూత
posted on Nov 25, 2014 8:52AM

ప్రఖ్యాత కథక్ నాట్య కళాకారిణి సితారాదేవి ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో మంగళవారం నాడు మరణించారు. సితారాదేవి వయస్సు 94 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం నాడు సితారాదేవి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి అయిన సితారాదేవి బాల్యం నుంచే కథక్ నాట్యం చేస్తున్నారు. ఆమెకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ముందు నాట్య ప్రదర్శన ఇచ్చారు. ఆమె నాట్యాన్ని చూసి ముగ్ధుడైన ఠాగూర్ ఆమెను నృత్య సామ్రాజ్ఞి అని పిలిచారు. సితారాదేవి భారతదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వేలాది కథక్ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె రెండు సార్లు వివాహం చేసుకున్నారు. అయితే రెండు వివాహాలూ విఫలమయ్యాయి. సితారాదేవి మృతిపట్ల నరేంద్రమోడీ సంతాపం తెలిపారు.