దమ్ముంటే గెలవండి.. కోట్ల సవాల్
posted on Feb 19, 2021 9:35AM
ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం సాగుతున్న సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికలలో వైసీపీని గెలిపించకుంటే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని వాలంటీర్ల ద్వారా ఓటర్లను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.అలాగే పోలీసులను పక్కనపెట్టి వైసిపి నేతలు పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. మంత్రులకు దమ్ముంటే పెండింగ్ ప్రాజెక్ట్‌లకు నిధులు విడుదల చేయాలని కోట్ల సవాల్ విసిరారు.
వైసీపీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని కోట్ల అన్నారు. టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని అయన భరోసా ఇచ్చారు. ప్రజాసేవే తమ లక్ష్యమని, అలాగే రాష్ట్ర ప్రజలు బాగుండటమే తమకు కావాలని సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. మరోపక్క పేకాట, బెట్టింగులను ప్రోత్సహిస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు ఉందా..? అని కోట్ల సూటిగా ప్రశ్నించారు.