'నన్ రేప్' నిందితుల పట్టివేత
posted on Mar 16, 2015 10:44AM

కోల్కత్తాలోని నాడియా జిల్లాలో గంగ్నాపూర్ లో శుక్రవారం అర్ధరాత్రి 72 సంవత్సరాల నన్ పై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి తరువాత స్కూల్లోకి చొరబడ్డ సుమారు పన్నెండుమంది దొంగల్లో నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, లాకర్ లోని 12 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకొన్నపశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించింది. ఘటన జరిగిన ప్రాంతంలో సీఐడీ పోలీసులు సీసీటీవీ పుటేజ్ను సొంతం చేసుకొని నలుగురు నిందితులను గుర్తించారు. ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టగా ఎనిమిదిమంది పట్టుబడ్డారు. మిగిలిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, నిందితులను అరెస్ట్ చేయడానికి అవసరమైన వివరాలు చెప్పినవారికి రూ. లక్ష బహుమతి అందిస్తామని పోలీసులు ప్రకటించారు.