బస్సుకోసం చూస్తున్న యువతిపై అత్యాచారం
posted on Mar 16, 2015 10:20AM

రోజురోజుకూ ఆడవాళ్లపై ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. ఎన్ని చట్టాలు వచ్చినా ఏ మాత్రం మార్పులేదు. రంగారెడ్డి జిల్లా పోడూరు మండలం మన్నెగూడ సమీపంలో దారుణం చోటుచేసుకొంది. రాత్రి బస్సు కోసం వేచి చూస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దానయ్య అనే ఆటో డ్రైవర్ ఆ యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చుతానని చెప్పి తరువాత మార్గ మధ్యంలో తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి యత్నించాడు. అయితే యువతి కేకలు విన్న గ్రామస్తులు... పోలీసులకు సమాచారం అందించగా, ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.