సీఎం తో రచ్చబండలో పాల్గొన్న జయసుధ
posted on Nov 10, 2011 1:34PM
హైదరా
బాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న రచ్చబండ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చేర్యాలలో సిఎం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జయసుధ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు వచ్చే మూడేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మూడేళ్లలో తాము చెప్పినట్లుగా పదిహేను లక్షల ఉద్యోగాలు ఇస్తామని, వచ్చే డిసెంబర్ లోగా లక్ష ఉద్యోగాలు కేటాయిస్తామని చెప్పారు. రైతులకు వడ్డీ లేకుండా రూ.లక్ష రూపాయల వరకు రుణం, రూ.1300 కోట్ల వ్యయంతో ఉద్యోగ శిక్షణా కేంద్రాలు, రచ్చబండ రెండులో ఆరు లక్షల మందికి ఇళ్లు మంజూరు, పొదుపు సంఘాలకు ఏడు శాతం వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.