కొడుకునే చంపేశాడు

 

కన్న కొడుకునే గొడ్డలితో నరికి హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. ఇంతటి దారుణమైన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కొమ్మా వసంతరావుకు, శాంతికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే వసంతరావుకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శాంతి అతనిని, కొడుకుని తీసుకొని మూడేళ్ల క్రితమే తన తల్లి ఇంటికి వచ్చేసింది. కూలీ పనులు చేసుకుంటూ తన భర్తకు వైద్యం చేయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే గురువారం ఉదయం శాంతికి, వసంతరావుకి మధ్య గొడవ జరిగింది. తర్యాత శాంతి బట్టలు ఉతకడానికి వెళ్లగా.. వసంతరావు మంచం మీద ఉన్న కొడుకుని నేల మీద పడుకోబెట్టి గొడ్డలితో అతి కిరాతకంగా చంపాడు. ఇది గమనించిన స్థానికులు పరారవ్వడానికి ప్రయత్నించిన వసంతరావుని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. రక్తపు మడుగులో పడిపోయి ఉన్న కొడుకుని చూసి శాంతి ఒక్కసారిగా షాక్ కు గురైంది. బాలుడి మేనమామ పాల్‌రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే కన్నకుమారుడిని చంపడానికి గల కారణాలు తెలియరాలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu