పాకిస్థాన్... 213 ఆలౌట్
posted on Mar 20, 2015 12:19PM

ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో భాగంగా శుక్రవారం అడిలైడ్‌లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలు తలపడుతున్నాయి. పాకిస్తాన్ టాస్ గెలుచుకొని బ్యాటింగ్ ఎంచుకొంది. పాకిస్థాన్ తన ఇన్నింగ్స్‌లో 49.5 ఓవర్లకు 213 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే రెండు వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. 22 పరుగుల స్కోరు దగ్గరకు వచ్చేసరికే రెండు వికెట్లను కోల్పోయింది. అహ్మద్ హెహజాద్ (5), షర్ఫాజ్ అహ్మద్ (10) పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్ వికెట్లు ఒక్కటొక్కటే టపటపా రాలిపోయాయి. బోలెడంత స్కోరు చేయాలని బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ చివరికి 213 స్కోరు వద్ద తన ఇన్నింగ్స్‌ని ముగించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం ఖాయమని చెప్పకనే చెప్పింది.