రేప్ చేయబోయాడు..మర్మాంగం కట్ చేసింది
posted on May 20, 2017 6:01PM
.jpg)
తనపై అత్యాచారం చేయబోయిన ఓ కామాంధుడిని ప్రతిఘటించి మళ్లీ ఎవరిపైకి వెళ్లకుండా అతని మర్మాంగాన్ని కట్ చేసింది ఓ యువతి. కేరళలోని కొల్లంలో పన్మానా ఆశ్రమంలో శ్రీహరి అనే వ్యక్తి గంగేశానంద తీర్థపాదం అనే పేరుతో స్వామిజీగా చెలామణి అవుతున్నాడు. ఆర్ధిక, కుటుంబ, విద్యా పరమైన సమస్యలతో నిత్యం ఎంతో మంది ఇతని ఆశ్రమానికి వస్తుంటారు. వీరిలో అందమైన మహిళలను గుర్తించి ప్రత్యేక పూజల నెపంతో వారికి ఇంటికి వెళ్లి అత్యాచారం చేసేవాడు..ఈ నేపథ్యంలో తిరువనంతపురానికి చెందిన ఓ విద్యార్థిని తన సమస్యను పరిష్కారించాల్సిందిగా స్వామిజీని కలిసింది.
ఆమెపై కన్నెసిన గంగేశానంద ఇంటికి వచ్చి పూజ చేయాలని చెప్పాడు. అందుకే ఆ యువతి సరేననడంతో నిన్న ఆమె ఇంటికి వెళ్లాడు. అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పూజలు ప్రారంభించి విద్యార్థినిపై అత్యాచారం చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది..అయినా ఆ కామాంధుడు వదలకపోవడంతో పక్కనే ఉన్న కత్తితో అతని మర్మాంగాన్ని కట్ చేసింది. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు గంగేశానందను తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వామిజీ గుట్టును రట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.