రోహిణి కార్తెలో నిజంగా రోలు పగిలింది..ఎక్కడో తెలుసా
posted on May 20, 2017 5:55PM

మనం ఏదో సరదాగా అనుకునే సామెతలు..ఎప్పుడు, ఎలా పుట్టాయో తెలియదు కానీ ఆ సామెతల్లో మాత్రం నిగూఢమైన అర్థం దాగి ఉంటుంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నాం అంటే మే నెల..పైగా రోహిణి కార్తె..ఈ కాలంలో తరచూగా మనకు వినిపించే డైలాగ్ రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని. మీరు అనటమే కానీ ఏనాడైనా చూశారా అని కొందరు అడ్డంగా వాదిస్తూ ఉంటారు. ఇలాంటి వారి కళ్లు తెరిపించే ఘటన ఒకటి మన రాష్ట్రంలోనే జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట పంచాయతీ కొత్తపల్లిలో భానుడి దెబ్బకు ఓ రోలు మూడు ముక్కలైంది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అంతేకాదు రోడ్డుపై వాహనాలు సైతం నిలువునా తగలబడిపోతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు.