జూన్ 2నే సీఎంగా కేసిఆర్, గవర్నర్‌గా నరసింహన్
posted on May 31, 2014 5:16PM
.jpg)
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తానని నరసింహన్ తెలిపారు. అదే రోజు ఉదయం 8.15 గంటలకు తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. జూన్ 2న తెలంగాణలో రాష్ట్రపతి పాలన ముగుస్తుందని పేర్కొన్నారు. ఏపీలో జూన్ 8 వరకు రాష్ట్రపతి పాలన ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సీఎంలు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ర్టాలు సమానంగా అభివద్ధి చెందుతాయని ఆశిస్తున్నానని చెప్పారు. విద్యుత్ పంపిణీపై ఇద్దరు సీఎంల మధ్య చర్చ జరగాలన్నారు. తెలంగాణకు విద్యుత్ అవసరం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తగిన జలవనరులు ఉన్నందున అక్కడ వినియోగం తక్కువగా ఉంటుందని చెప్పారు. వినియోగం ఆధారంగా విద్యుత్ కేటాయింపు ఉంటుందన్నారు. రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్రమోడీకి అన్ని వివరించాను.. అన్నీ సావధానంగా విన్నారని తెలిపారు. నాలుగేళ్ల పాటు ఎలాంటి బుల్లెట్ వాడకుండా శాంతిభద్రతలు కాపాడామని పేర్కొన్నారు.