ఒకరి అవసరం.. ఇంకొకరి అదృష్టం! కొందరు లీడర్లకు అనుకోని పదవులు.

రాజకీయాలలో కొందరి అవసరాలు, ఇంకొందరికి  అదృష్టంగా మారతాయి. అవకాశాలకు తలుపులు తీస్తాయి. అలా, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియని మాజీలు అనేక మందికి హుజూరాబాద్ ఉప ఎన్నిక, మంచి రోజులు మోసుకొచ్చింది. మాజీలను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది.  ఎల్. రమణ, పెద్ది రెడ్డి, కౌశిక్ రెడ్డి ఇలా చాలామందికి హుజూరాబాద్ ఉప ఎన్నిక కొద్దిగా ఎక్కువతక్కువగా అదృష్టాన్ని పంచిందనే చెప్ప వచ్చును. అయితే, ఇచ్చిన వరాలు నిజంగా నిజం అవుతాయా, దళిత ముఖ్యమంత్రి జాబితాలో చేరిపోతాయా, అనేది పక్కన పెడితే, ఇంతవరకు  ముట్ట వలసినవి ఏవో ముట్టే ఉంటాయి కాబట్టి, అంతవరకు అయినా వారు  అదృష్టవంతుతే అవుతారు. 

ఆదివారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సరుభి వాణీ దేవి, నిజంగా మహాజాతకురాలనే చెప్పవచ్చును. అలాగని, ఆమెకు ఎమ్మెల్సీ అయ్యేదుకు అర్హతలు లేవని కాదు. ఆమెకు ఎమ్మెల్సీ కావడానికి ఉండవలసిన అర్హతలు అన్నీ ఉన్నాయి. అన్నిటితో పాటు, ‘పీవీ గారమ్మాయి’ అనే ప్రత్యేక అర్హత కూడా ఉంది. అయితే, ఆమెకు ఈ అర్హతలు ఎప్పటినుంచో ఉన్నా, ఇప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్’ ఆమెకు అవకాశం ఇచ్చింది మాత్రం ఆయన అవసరం కోసమే.. దుబ్బాక, జీహెచ్ఎంసీ వరస దెబ్బల  తర్వాత, వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరవలసిన అగత్యం ఏర్పడింది కాబట్టే, పీవీ పేరు, కుల సమీకరణలు అనీ బెరేజు వేసుకునే కేసీఆర్ ఆమెను ఆఖరి క్షణంలో పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. రాష్ట్ర మంత్రి వర్గం మొత్తంగా రంగంలోకి  దిగి ఆమెను గెలిపించుకున్నారు. 

కేవలం రాజకీయ నాయకులకే కాదు, రాజకీయ పార్టీల అవసరాలు జనాలకు కూడా అనుకోని, ఆశించని మేళ్ళు చేస్తాయి, అందుకు, వేరే ఉదాహరణ అవసరం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక్కటి చాలు. ఎంత మందికి ఇస్తారు, ఎంత కాలం అమలు చేస్తారు, అనే విషయన్ని పక్కన పెడితే, ఫ్యామిలీ’కి పదిలక్షల రూపాయలు ఇచ్చే దలిత బంధు పథకం వచ్చిందంటే, అందుకు ఆ నియోజక వర్గంలో గెలుపు, అధికార తెరాసకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీకి అత్యవసరం, కావడమే కారణం. దళిత బంధుతో పాటుగా ఇంకా చాలా చాలా పథకాలు పరుగులు పెడుతున్నాయి. దళితులకు దళిత బంధు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి, గెలలు శ్రీవాస యాడవ్’కు ఏకంగా పార్టీ టికెట్, ఇచ్చిన కేసీఆర్, అదే క్రమంలో 26 వేలకు పైగా ఓట్లున్న పద్మశాలీ వర్గానికి రేపో మాపో చేనేత బీమా పధకాన్ని ప్రకటిస్తారని సమాచారం. నిజానికి, హుజూరాబాద్ ఫలితం ఎలా ఉంటందో ఏమో కానీ, అధికార పార్టీ గెలుపు ఆరాటంలో అటు పేడవుట్ అయిన రాజకీయ నాయకులకు, ఇటు ప్రజలకు కూడా మేలు జరిగింది.  

అదలా ఉంటె, ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ వాణీ దేవీ,ప్రజాసేవ చేయడానికి పదవే అవసరం లేదన్న తలతిక్క తనకు ఉండేదని, కానీ కొన్ని పనులు చేయాలంటే పదవి ఉండాలని గ్రహించానని చెప్పారు. నిజమేల, అధికారం లేని ఆదర్శాల వలన ప్రయోజనం ఉండదు. మార్చిలో జరిగిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె విజేతగా నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో వాణీదేవి గెలిచారు. వాణీదేవికి 1,28,010 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu