ఆరునెలల పాటు సమ్మెలు నిషేదం
posted on Sep 21, 2013 9:01PM

తెలంగాణ ప్రకటనతో సీమాంద్ర జిల్లాల్లో ఎగసి పడ్డ సమ్మెలను కట్టడి చేయటానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. సమ్మె మొదలయిన దగ్గర నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం. ఎంతకీ చర్చలు ఫలించకపోవటంతో కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు కూడా ఉద్యోగ సంఘాల మీద ఎటువంటి చర్యలకు ఆదేశాలు ఇవ్వక పోవడంతో ఇప్పుడు మరో ఆయుదాన్ని ప్రయోగించింది ప్రభుత్వం.
ఆరు నెలల పాటు మున్సిపాలిటీ, కార్పోరేషన్‌లలో సమ్మెలను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. శనివారం జారి అయిన ఈ జీవో ఆ రోజు నుంచి అమలు అవుతుందని ప్రకటించింది. ప్రస్థుతం రాష్ట్రంలో ఉన్న 162 మున్సిపాలిటీలు, 19 కార్పోరేషన్‌లలో శనివారం నుంచి సమ్మెలు నిషేదం.