నేనొక్కడినే దటీజ్ కేసీఆర్!
posted on Aug 3, 2025 11:10AM
.webp)
తెలంగాణ జాతి పితను నేను. నాకు తెలీదా? ఇదే కేసీఆర్ కొంప ముంచిందా? అంటే అవుననే చెప్పాలి. కేసీఆర్ ది అంతా ఎలా ఉంటుందంటే సర్వం.. తెలుసు అన్నట్టు ఉంటుందని అంటారు ఆయన మనసు బాగా ఎరిగిన వారు. మనకు తెలీకనా అన్నట్టు ప్రతిదాన్లోనూ ముద్ర వేయాలని చూస్తారనీ. అది కాళేశ్వరం అయినా యాదాద్రి సెట్ అయినా ఒకటేనంటారు. అలాంటి శైలి కనబరుస్తారని చెప్పుకొస్తారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. ప్రస్తుతం కాళేశ్వరం సంగతే తీసుకుంటే.. బ్యారేజీలు ఎప్పుడు ఎక్కడ ఎలా కట్టాలో ఆయనే చెప్పారు. నీటి నిల్వ నిర్ణయమూ ఆయనదే. ఓ అండ్ ఎం చేయించలేదు.
అంచనాలను పెంచింది. కాంట్రాక్టర్లను సవరించిందీ ఆయనే. బ్యారేజీలు కూలడానికి అవకతవకలకు కారణం ఆయనే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ కి తోడు హరీష్. అంతా మాదే. మాకే అన్నీ తెలుసు. ఎలాంటి నిపుణుల పర్యవేక్షణ అక్కర్లేదు. ఈ ఇరువురూ నిర్ణయం తీస్కుని తర్వాత వ్యాస్కోస్ కి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. హైపవర్ కమిటీనైతే తుంగలో తొక్కేశారు. భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మేడిగడ్డ ఏడో బ్లాకు పునరుద్దరణ బాధ్యత ఎల్ అండ్ టీదే. అన్నారం, సుందిళ్లతో పాటు సరిచేయాల్సింది నిర్మాణ సంస్థలే. కమిషన్ కు కేసీఆర్, హరీష్ తప్పుడు సాక్ష్యాలు.
ఇదీ ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ నివేదిక. దీన్నిబట్టీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు జాతి పితగా ప్రజల ముందు తలెత్తుకోవల్సిన వాడు కాస్తా.. తల దించుకోవల్సి వస్తోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్.కేసీఆర్ పై గతంలో మీడియా హైప్ కూడా అలాగే ఉండేది. పెద్ద సారే సింహం- పెద్ద సారే చిట్టెలుక. పెద్ద సారే రాజు- పెద్దసారే బంటు. ఒక సమయంలో రేవంత్ ని తయారు చేసింది సీఎంని చేసిందీ ఆయనే అనే ఎలివేషన్లు ఇవ్వడంతో ఇదీ ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు చూడండీ.. జీవనాడి కావల్సిన ప్రాజెక్టు కాస్తా తప్పుల తడకగా మారింది.
ఇదే పెద్దసార్ తో పాటు ఈఎన్సీలు, ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్లు, నీటిపారుదల కార్యదర్శులు, ఆఖరికి ఆనాటి సీఎం అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ వంటి వారు కూడా ఇందులో ఇరుక్కున్నట్టయ్యింది. మరీ ముఖ్యంగా హరిరాం, నూనెశ్రీధర్, మురళీధర్ రావులైతే ఏకంగా వెయ్యికోట్లు పైగా బొక్కిన ఇంజినీర్లు గా చరిత్రలో నిలబడి పోయారు. వీరే ఇలా మేశారంటే ఇక ఆ పై వారి పరిస్థితి ఏంటో అన్న పేరొచ్చేసింది. దటీజ్ కేసీఆర్ నేనొక్కడినే పాలసీ అంటే అన్నది ప్రస్తుతం సర్వత్రా వినిపిస్తోన్న మాట.