కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

 

జమ్మూ కశ్మీర్‌‌లో  కుల్గాం అఖల్‌దేవ్‌సర్‌లో మూడు రోజు ఆపరేషన్‌  కొనసాగుతోంది. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయినట్లుగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు. ఓ జవాన్ గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు గాలింపు చేపట్టారు.

కాగా, అటవీ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకపాలాలు జరుగుతున్నట్టు ఇంటలిజెన్స్ సమాచారం ఆగస్టు 1న భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరపగా.. శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu