కేసీఆర్‌కు అనారోగ్యం..ఆస్పత్రిలో అడ్మిట్

 

బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యులు కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. లండన్ నుంచి నేడు హైదరాబాద్ వచ్చిన కేటీఆర్, అధినేత అనారోగ్యం బారిన పడటంతో ఆయన వెంట కేటీఆర్ కూడా వెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అధినేత అరోగ్యంపై బీఆర్‌ఎస్ నాయకులు గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.