కేటీఆర్, హరీశ్‌రావుతో కేసీఆర్ కీలక సమావేశం
posted on Jul 31, 2025 3:11PM

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు సభాపతి నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. ఈ అంశంపై నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నేటితో పి.జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వర కమిషన్ గడువు ముగిసి.. ప్రభుత్వానికి రిపోర్టు అందిన నేపథ్యంలో ఆ అంశంపై గులాబీ బాస్ చర్చించినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టులో లోపాలకు తామే కారణమని నివేదిక ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదురుకోవాలని అంశంపై డిస్కస్ చేయబోతున్నట్లుగా సమాచారం. చివరగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ శ్రేణులను యాక్టివ్ చేయడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించే చాన్స్ ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టులో తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
జూబ్లీహిల్స్ బైపోల్ పార్టీ సన్నద్ధత, అభ్యర్థి ఎంపికపై హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కేటీఆర్ తమ అభిప్రాయాలను కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కష్టకాలంలో మాకు అండగా నిలిచిన లీగల్ టీమ్స్, బీఆర్ఎస్ సైనికులకు ధన్యవాదాలు. నేను అర్థం చేసుకున్నట్లుగా, 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు మాకు మూడు నెలల సమయం ఉంది. పనిలోకి వెళదాం బాయ్స్! అని కేటీఆర్ ఎక్స్ పిలుపునిచ్చారు.