కవిత అరెస్ట్ పై దాగుడు మూతలు 

కర్ణాటక ఫలితాల తర్వాత మద్యం కుంభకోణంలో నిందితురాలైన కల్వకుంట్ల కవితపై బిజెపీ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. కర్ణాటక ఫలితాల తర్వాత కవిత అరెస్ట్ ఖాయమని తెలంగాణ బిజెపి నేతలు ప్రచారం చేశారు. ఆమె జైలు గది కూడా సిద్దమైందని ఒక దశలో ప్రచారం చేశారు. కర్ణాటక ఎన్నికలకు ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎటువంటి సంబంధం లేదు. కర్ణాటక ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వెలువడ్డాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న బిజెపి ఓడిపోయింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని దేవగౌడ అభ్యర్థన మేరకు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కెసీఆర్ పాల్గొనాలి. ఢిల్లీ బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం కాగానే కెసీఆర్ నేరుగా కర్ణాటక వెళతారని షెడ్యూల్ లో ఉంది. జెడీఎస్ తరపున కెసీఆర్ ఏ ఒక్క బహిరంగ సమావేశంలో పాల్గొనలేదు. బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కూతురు కవితను అరెస్ట్ చేస్తామని బిజెపి బ్లాక్ మెయిల్ చేసిందని తెలంగాణాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. జనతాదళ్ ఎస్  పార్టీకి ఫండ్ ఇస్తానని కెసీఆర్ హామి ఇచ్చినట్లు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ ఎస్ నేత  కుమార స్వామి చెప్పారు. ఫండ్ ఇవ్వలేదు కనీసం ప్రచారం కూడా చేయలేదని కుమారస్వామి ఆరోపించారు. 
కాగా తెలంగాణలో తమ పార్టీ మూడో పొజీషన్ లో ఉందని తెలంగాణ బిజెపి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికలకు ముందు ఈ బిజెపి నేతలు తెలంగాణలో అధికారంలో వస్తామని, తమకు బిఆర్ఎస్ పోటీ కూడా ఇవ్వలేదని జోస్యం చెప్పారు. అనేక చోట్ల బిఆర్ఎస్ డిపాజిట్లు కూడా రావని చెప్పారు. కవిత అరెస్ట్ అటకెక్కిన తర్వాత తెలంగాణ బిజెపి నేతలు కాంగ్రెస్ , బిఆర్ఎస్ మధ్యే పోటీ ఉండబోతుంది. మేము థర్డ్ పొజిషన్ లో ఉంటామని అంగీకరిస్తున్నారు. 
ఇంత పెద్ద భారీ స్కాంలో నిందితురాలైన కవితను కాపాడటానికి కెసీఆర్ చక్రం తిప్పారని జోరుగా ప్రచారం జరుగుతుంది. 
కూతురును సిబిఐ, ఈడీ కేసుల నుంచి విముక్తి చేయడానికి కెసీఆర్ బిజెపితో అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది. బిజెపిని పల్లెత్తు మాట అనడం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు.

కవిత అరెస్ట్ అయితే తమ పార్టీ గెలుస్తుంది. ఒక వేళ చేయకపోతే తమ పార్టీ ఓడిపోతుందని తెలంగాణ బిజెపి నేతలు బాహాటంగానే స్టేట్ మెంట్ ఇచ్చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధం ఉన్నట్లు  ఆరోపణ ఎదుర్కొంటున్న శరత్ రెడ్డి గత సంవత్సరం నవంబర్ లో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ప్రస్తుతం ఆయన అప్రోవర్ గా మారిపోయారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం అధికారులు అతని నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను బట్టి కెసీఆర్ కూతురు కవిత అరెస్ట్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. కెసీఆర్ తమ గుప్పిట్లో ఉండే విధంగా బిజెపి ప్రభుత్వం శరత్ రెడ్డి ని అప్రోవర్ గా నియమించిందని ప్రచారం జరుగుతోంది.