సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న గవర్నర్‌ దంపతులు

 

కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దంపతులు పుష్కర పుణ్య స్నానం ఆచరించారు.  గవర్నర్‌ దంపతులకు మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు స్వాగతం పలికారు.   అనంతరం గవర్నర్ సతీసమేతంగా ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మే 15 నుండి మే 26 వరకు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో జరుగుతున్నాయి. ఈ పవిత్ర 12 రోజుల ఉత్సవంలో గోదావరి, ప్రాణహిత, భూగర్భ సరస్వతీ నదుల త్రివేణీ సంగమంలో భక్తులు పుష్కర స్నానం చేస్తారు. 

పుష్కరాల సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. టీఎస్‌ఆర్టీసీ ద్వారా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సరస్వతి పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పుష్కరాలు ముగింపు దశకు రావడంతో భారీగా తరలివస్తున్నారు. కాళేశ్వరం నుంచి సిరోంచ బ్రిడ్జి వరకు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నేడు 5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu