బిజేపీ గూటికి కన్నా...

గుంటూరు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీమంత్రి కన్నాలక్ష్మీ నారాయణ బిజేపీలో చేరారు. కాపు వర్గానికి చెందిన ఈయన బీజేపీలో చేరటంతో గుంటూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రం... కొత్త రూపు సంతరించుకుంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే కాంగ్రెస్ లో ఉండగా బద్ద శత్రువులుగా తరుచూ కీచులాడుకునే రాయపాటి సాంబశివరావు, కన్నాలక్ష్మీ నారాయణ ఇప్పుడు తిరిగి మిత్ర పక్షాలలో  కలసి పనిచేయాల్సి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా వుంటుందీ అని కూడా చర్చించుకుంటున్నారు.