బీజేపీలో చేరనన్న మేకపాటి

తనకు పార్టీ మారే ఆలోచనలేదని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరతానని పత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. కేవలం తను ప్రజాపతినిధిగానే జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. మోడీ మంచి చేస్తున్నారు కాబట్టే ప్రశంసించానని అన్నారు. కొత్తపల్లి గీతపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరతామని మేకపాటి చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu