తెలంగాణ నూతన సీఎస్‌గా కె.రామకృష్ణారావు నియామకం

 

తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ శాంతి కుమారి ఈ నెల 30 పదవీవిరమణ చేయనున్నారు. 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కె.రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

రామకృష్ణారావు తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన రిటైర్ కానున్నారు. ప్రస్తుతమున్న ఐఏఎస్‌ల్లో శశాంక్ గోయల్  తరువాత రామకృష్ణారావు సీనియర్‌గా ఉన్నారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో తనకున్న అనుభవం తోడ్పడుతుందన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనను నియమించారు. రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్‌,  గుంటూరు కలెక్టర్‌ గా  కూడా విధులు నిర్వహించారు.