మరోసారి నోరుజారిన కర్ణన్.. పిచ్చి జడ్జీలు...పిచ్చి ఆదేశాలు
posted on May 5, 2017 10:20AM
.jpg)
ఇప్పటికే కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ కోర్టు ధిక్కారణ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈకేసు విచారణలో భాగంగా.. సుప్రీంకోర్టు ఇటీవల ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించమని కూడా ఆదేశించింది. అయితే ఇప్పుడు మరోసారి కర్ణన్ జడ్జిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నలుగురు వైద్యుల బృందం కర్ణన్ నివాసానికి వెళ్లింది. అక్కడ పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించిన కర్ణన్ మాట్లాడుతూ... అవి పిచ్చి జడ్జీలు ఇచ్చిన పిచ్చి ఆదేశాలు అని కొట్టి పడేశారు. తాను భేషుగ్గా ఉన్నానని, తనకు వైద్య పరీక్షలు నిర్వహించాలనుకోవడం తనను అవమానించడమేనని అన్నారు. వైద్య పరీక్షలను తిరస్కరిస్తున్నట్టు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. అయితే ఇటువంటి పరీక్షలను తన సంరక్షకుడి సమక్షంలోనే నిర్వహించాలని, తనకు సంబంధించినవారు లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం కుదరదని ఆయన తేల్చి చెప్పారు.