భారత్ కు ఆ హక్కు కూడా లేదు... పాక్ అక్కసు...
posted on May 5, 2017 10:45AM
.jpg)
భారత్ పై ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విమర్శలు గుప్పించే పాక్.. ఇప్పుడు తాజాగా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. ఇద్దరూ భారత సైనికుల మృతదేహాలను పాక్ ముక్కలుగా నరికిన నేపథ్యంలో దీనిపై ఆగ్రహించిన భారత్... పాక్ కు గట్టిగా సమాధానం చెబుతామని.. ప్రతీకారం తీర్చుకుంటామి చెప్పిన క్రమంలో.. ఈవ్యాఖ్యలపై స్పందించిన పాక్... భారత్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని చెబుతోంది. ఈ సందర్భంగా పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా మట్లాడుతూ, భారత సైనికుల తలలను తాము నరకలేదని.. తమపై అనవసరంగా భారత్ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. మపై చేస్తున్న ఆరోపణలను ఐక్యరాజ్యసమితి ముందు ఉంచే హక్కు కూడా భారత్ లేదని... ఆ హక్కును భారత్ ఎప్పుడో కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఐక్యరాజ్యసమితికి భారత్ ఎన్నడూ కట్టుబడి ఉండలేదని చెప్పారు.