నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే 4 వేల ఇళ్లు కట్టిస్తా : సీఎం రేవంత్

 

బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారంలో  రహమత్‌నగర్‌లో ముఖ్యమంత్రి రోడ్‌షో చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేయిల కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన ప్రధాని మోదీ, అమిత్‌షా ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మాజీ మంత్రి హరీష్ రావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఈనెల 11లోగా వారిని అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.  ఫార్ములా ఈరేసు పేరుతో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. 

విచారణ జరిపి గవర్నర్‌కు పంపితే ఇప్పటివరకు అరెస్ట్ అనుమతి ఇవ్వలేదని సీఎం అన్నారు. కారు పార్టీ కమలం పార్టీ ఫెవికాల్‌ బంధం ఉందని పేర్కొన్నారు. 2007లో పి.జనార్దన్‌రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక వస్తే కేసీఆర్‌, టీఆర్‌ఎస్ క్యాండెట్‌ను పోటీలో నిలబెట్టారని సిట్టింగ్‌ ఎమ్మెల్యే చనిపోతే వచ్చే ప్రతి ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అధినేత అభ్యర్థిని పెట్టారని రేవంత్ అన్నారు. రెండేళ్ల పాలనలో జూబ్లీహిల్స్‌లో 14,159 రేషన్‌ కార్డులు మంజూరు చేశామని నవీన్ యాదవ్ గెలిపిస్తే 4 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.  జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి  30 వేల మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని ముఖ్యమంత్రి విశ్వసం వ్యక్తం చేశారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu