జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్టు

రాజధాని అమరావతిని, అమరావతి మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన  జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు బుధవారం (జూన్ 11) అరెస్ట్ చేశారు. వైసీపీ మీడియా చానెల్ లో ఓ చర్చా కార్యక్రమంలో కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడమే కాకుండా పలు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణంరాజును ఏ1గా చేర్చారు. ఇదే కేసులో ఇప్పటికే ఆ చానెల్ ఉద్యోగి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇక అమరావతి మహిళలపై, అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును   భీమిలి  సమీపంలో అరెస్టు చేసి  , నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనను గురువారం (జూన్ 12) కోర్టులో  హాజరు పరుస్తారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu