అఫ్జల్‌గురువు కోసం18 విశ్వవిద్యాలయాలలో ప్రదర్శన
posted on Feb 18, 2016 12:15PM
.jpg)
దిల్లీలోని జవహర్‌లాల్ విశ్వవిద్యాలయంలో తీవ్రవాది అఫ్జల్‌గురుకి అనుకూలంగా జరిగిన ప్రదర్శన అనుకోకుండా ఏర్పాటు చేసింది కాదని తెలుస్తోంది. ఆ సంస్థలో పీ.హెచ్.డీ చేస్తున్న ఉమర్ ఖాలిద్ అనే విద్యార్థి దేశవ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాలలో ఇలాంటి ప్రదర్శనని ఏర్పాటు చేయాలనుకున్నాడట. అందులో భాగంగానే అక్కడ అఫ్జల్‌గురుని అమరుడిగా కీర్తిస్తూ ఒక కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కానీ ఆ కార్యక్రమం వివాదాస్పదం కావడంతో ఉమర్ ఖాలిద్ పప్పులు ఉడకలేదు. పోలీసులు కనుక తొందరపడకుండా నిదానంగా విచారించి ఉంటే... ఈ కేసులో అసలు ముద్దాయి ఉమర్ ఖాలిద్ అని తేలిపోయేది అంటున్నారు కొందరు పరిశోధకులు. ఎందుకంటే ప్రస్తుతం ఉమర్ రొమ్ము విరుచుకుని తిరుగుతుండగా, మరో విద్యార్థి నాయకుడైన కన్నయా కుమార్ జైల్లో మగ్గుతున్నాడు. DSU అనే విద్యార్థి సంఘ నాయకుడైన ఉమరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించినట్లు ఇప్పుడిప్పుడే తేల్తోంది. ‘న్యాయవ్యవస్థ చేతిలో చనిపోయిన అఫ్జల్‌గురుకి మద్దతుగా, భారతీయ సైనికులు చేస్తున్న దుర్మార్గాలకి వ్యతిరేకంగా, కశ్మీర్‌లోని ప్రజలని హత్య చేస్తున్నందుకు నిరసనగా’ తాము ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉమర్ ఖాలిద్ కరపత్రాలను పంచి విద్యార్థులందరినీ చేరదీసినట్లు తెలుస్తోంది. సహజంగానే అవేశపూరితంగానే ఉండే విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల వైపు ఆకర్షితులైతే?