మోడీ చెప్పిన కొద్ది గంటలకే.. దారుణ హత్య...
posted on Jun 30, 2017 12:03PM
.jpg)
గో సంరక్షణ పేరుతో ఇప్పటికే పలువురిని దారుణంగా హతమార్చిన సంఘటనలు ఎన్నో చూశాం. ఇక ఈ ఘటనలపై స్పందించిన ప్రధాని మోడీ కూడా అలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అయితే సాక్ష్యాత్తు దేశ ప్రధాని చెప్పినా కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఝార్ఖండ్‌లో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...ఝార్ఖండ్‌లో రామ్‌గఢ్ జిల్లాలోని బజర్తంద్ గ్రామంలో..అలీముద్దిన్ అనే వ్యక్తి తన కారులో వెళ్తుండగా.. గ్రామ శివారులో కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. అలీముద్దిన్‌ను కారు నుంచి దింపి తీవ్రంగా కొట్టారు. బీఫ్‌ను తరలిస్తున్నాడని ఆరోపిస్తూ.. అతడి కారుకు నిప్పటించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగానే.. దుండగలు అప్పటికే అక్కడి నుండి పారిపోయారు. అయితే తీవ్రంగా గాయపడిన అలీముద్దిన్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని పోలీసులు చెబుతున్నారు. అలీముద్దిన్ ఆ దారిగుండా వస్తున్నాడని తెలిసి దుండగులు ముందుగానే అక్కడ వేచి ఉన్నారని.. అదను చూసి దాడి చేసినట్లు పేర్కొన్నారు. కాగా గుజరాత్ పర్యటనలో భాగంగా మోడీ గో సంరక్షణ పేరుతో అనవసర దాడులకు పాల్పడుతున్నారని... చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఎంతమాత్రం సరికాదని చెప్పారు. అయితే మోడీ చెప్పిన కొద్ది గంటలకే ఈ హత్య జరగడం గమనార్హం.