భారత్ కు చైనా వార్నింగ్.. ఆ యుద్దం గుర్తుందిగా...
posted on Jun 30, 2017 11:31AM
.jpg)
భారత్-చైనా మధ్య ప్రస్తుతం మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. సిక్కిం పరిసరాల్లోని సరిహద్దు ప్రాంతం వ్యవహారంలో రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీనిపై ఇప్పటికే చైనా భారత్ పై ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఈసారి మాత్రం ఓ అడుగు ముందుకేసి తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. అంతర్గత భద్రతతోపాటు చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చైనా.. ఇవి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలని వు స్పష్టంచేశారు. ఇండియన్ ఆర్మీ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి అని... 1962 యుద్ధం గుర్తుందిగా. యుద్ధానికి సై అనడాన్ని ఆపాలని ఆయన హెచ్చరించారు. మరి దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.