ఎవరీ చినజీయర్? పుట్టుక నుంచి స్వామీజీ వరకూ.. ఫుల్ డీటైల్స్
posted on Feb 8, 2022 1:21PM
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అంటే, అందరికీ తెలియక పోవచ్చును కానీ, చిన జీయర్ స్వామి, అంటే మాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఆద్యాత్మిక ప్రపంచంలో అడుగు పెట్టిన అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజున హిందూ సమాజంలో చిన జీయర్ స్వామి తెలియని వారు భాహుశా ఉండరు.
ముఖ్యంగా, హైదరబాద్ సమీపంలోని ముచ్చింతల్’లో వైభవోపేతంగా నిర్వహిస్తున్న శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు, అందులో భాగంగా ఏర్పటు చేసిన 216 అడుగుల, ‘సమతామూర్తి’ రామానుజాచార్యుల భారీ పంచలోహ విగ్రహం, చిన జీయర్ స్వామి వారిని ఆద్యాత్మిక ప్రపంచంలో మరో దృవ తారగా నిలిపాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,ఒకరని కాదు,సమస్త విశ్వం ఇప్పుడు ముచ్చింతల్’లో కొలువైన ‘సమతా మూర్తి’ వైపు తలెత్తి చూస్తోంది.
అయితే,ఇంతటి మహాత్తర కార్యానికి, మూల స్తంభంగా నిలించిన చిన జీయర స్వామి ఎవరు? ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి? శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిగా, చిన జీయర్ స్వామిగా అందరికీ తెలిసిన స్వామీజీ పూర్వాశ్రమ విశేషాలు,ఏమిటి?
ఆ వివరాల్లోకి వెళితే, తెలుసు కుంటే, నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ‘మానవ సేవే మాధవ సేవ’,అని ప్రపంచానికి చాటి చెప్పిన సమతా మూర్తి అడుగుజాడల్లో. నడుస్తున్న మన తరం సమతాముర్హ్తి చిన జీయర్ స్వామి, ఒక సాధారణ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. చిన్నతనం నుంచే సంసారం బాధ్యతలు మోస్తూ సాగిన ఆయన జీవితం అధ్యాత్మిక ప్రప్రంచం కీర్తి శిఖరాలను చేరుకోవడం నిజంగ దైవ సంకల్పం తప్ప మరొకటి కాదు. చిన్ జీయర్ స్వామి తమా ప్రస్థాన క్రమంలో రామానుజుల ఆధ్యాత్మిక, సమానత్వ ధారలు పంచి ఇవ్వడమే కాకుండా, సమాజంలోని అట్టడుగు వర్గాలకు విద్యా, వైద్య సేవలు అందించే విధంగా సేవా మూర్తిగాను, తమను తము మలచు కున్నారు. ఇది మాములు విషయం కాదు.నిజంగా దైవ సంకల్పం లేనిదే మనిశి మహానీయునిగా, మానవతా మూర్తిగా మారడం అయ్యే పని కాదు. అందుకే చిన జీయర స్వామి జీవితం దైవ సంకల్పం తప్ప మొకటి కాదు, అనేది ఏమాత్రం అతిశయోక్తి కాదు.
ఇక చిన జీయర్ స్వామి ఎక్కడ పుట్టారు? ఎలా ఎదిగారు? ఏమి చేశారు? ఎందుకు మారారు? వటి విషయాల్లోకి వెళితే, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిగ, చైనా జీయర్ స్వామిగా పేరొందిన స్వామిజీ 1956 సంవత్సరం నవంబర్ 3 తేదీన, దీపావళి పండుగ రోజున రాజమండ్రి సమీపంలోని అర్తమూరులో అలమేలు మంగతాయారు, వేంకటాచార్యుల దంపతులకు ప్రధమ సంతానంగా జన్మిచారు. తల్లి తండ్రులు వారికి పెట్టిన పేరు శ్రీమన్నారాయణాచార్యులు. సమీపంలోని గౌతమ విద్యాపీఠంలో స్వామి వేద గ్రంథముల, వైష్ణవ సంప్రదాయాలలో శిక్షణ పొందారు. తర్క శాస్త్రం, సంస్కృత భాషను నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వద్ద అభ్యశించారు.అలాగే, రాజముండ్రిలోని ఓరియంటల్ పాఠశాలలో పదవ తరగతి వరకు సాధారణ విద్యను అభ్యశించారు.
అయితే,అదే సమయంలో వారి తండ్రిగారు స్వర్గస్తులు కావడంతో,కుటుంబ పోషణ భారం నెత్తిన పడ్డింది. ఉద్యోగ అన్వేషణలో. చేతి సంచితో వంటిరిగా హైదరాబాద్ చెరుకున్నారు. చేదు అనుభావాలు చవిచూశారు. కొంత ప్రయత్నం తర్వాత, ఒక చిన్న ఉద్యోగం సంపాదించారు. అదే క్రమంలో టైపు, షార్ట్ హండ్ నేర్చుకుని ఉద్యోగంలో ఇంకో మెట్టు ఎక్కారు. మరి కొంతకాలానికి మరో కంపెనీలో మరి కొంచెం మంచి ఉద్యోగంలో కుదుట పడ్డారు.
ఇదే సమయంలో 1975 లో పెద జీయర్ స్వామి కాకినాడకు విచ్చేశారు. యజ్ఞ క్రతువు సాగిస్తున్న సమయంలో యాదృచ్చికంగా, శ్రీమన్నారాయణాచార్యులు (చినజీయర్ స్వామి)కు పెద జీయర్ స్వామితో పరిచయమ ఏర్పడింది. ఒక సందర్భంలో పెద జీయర్ స్వామి, తమకు ఒక స్టెనో గ్రాఫర్ కావాలని కోరడంతో, శ్రీమన్నారాయణాచార్యులు,అప్పటికే టైపు,షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నా తానే ఆ పని చేస్తానని ముందు కొచ్చారు. అలా, తమ తల్లి అనుమతి తీసుకుని, పెద జీయర్ వెంట ప్రయాణం ప్రారంభించారు.
ఇక అక్కడి నుంచి శ్రీమన్నారాయణాచార్యులు పెద జీయర్ అడుగులో అడుగేస్తూ, ముందుకు సాగరు. 23 సంవత్సరాల వయసులో, తల్లి అనుమతితో సన్యాస ఆశ్రమాన్ని స్వీక రించారు.
సన్యాస స్వీకరణ తర్వాత కొన్నేళ్లకు గీతాజ్యోతి ఉద్యమాన్ని చేపట్టారు. గీతాజ్యోతి ఉద్యమం కేవలం భగవద్గీత ప్రాచుర్య రూపకాన్నే కాక, సమాజంలో ఉన్న సోమరితనాన్ని తొలగించే, సౌభ్రాతృత్వ భావనను ప్రతి ఒక్కరిలో మేల్కొల్పగలిగే వ్యూహంగా కూడా రూపుదిద్దుకుంది. అక్కడితో స్వామివారు వారి కర్తవ్యం పూర్తి అయిందని అనుకోలేదు. అంధులను చేరదీసి వారు కళ్లు లేకున్నా.... కంప్యూటర్ విద్యలో గొప్ప నిపుణులు అవ్వాలని, ఎన్నో చోట్ల కాలేజీలని స్థాపించారు. అక్కడ అంధులకు శిక్షణనిచ్చేటందుకు, కొందరు నిపుణులను నియమించారు.
వేదం అనగా విశ్వకోటికి విజ్ఞానాన్ని అందించేది, మోక్ష సాధనకు పునాది అయిన విద్య వేదం. అలాంటి వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి, ఎన్నో ఆశ్రమాలను స్థాపించారు స్వామివారు. విద్య అనేది ఒక వర్గానికో, వర్ణానికో కాక, మానవాళికంతటికి అందాలనే ఉద్దేశంతో ఆ వేద పాఠశాలలనే గురుకుల పాఠశాలలుగా మలచి, అన్ని రకాల విద్యలనీ బోధించే సౌకర్యాన్ని ఆ పాఠశాలల్లో కల్పించారు12నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. దీన్నిబట్టి స్వామివారి పట్టుదల, స్వామివారికి విద్యపై ఉన్న గౌరవం, ప్రేమ అర్థం చేసుకోవచ్చు. ధార్మిక సైనికులను తయారు చేయడంలో, కీలకపాత్ర పోషించారు. . శ్రీరామ నగరం, శంషాబాద్ లో జిమ్స్ అనేటటువంటి ఒక ఆస్పత్రిలో ఉచిత వైద్య విధానాన్ని ప్రవేశపెట్టి, వైద్యరంగ పరమైన అనుగ్రహాన్ని కూడా స్వామివారు సమాజంపై చూపినారు. అయితే..... మరలా సోమరితనపు ఛాయలు కమ్ముతున్న సమయంలో శాంతి సుందరం కార్యక్రమం నిర్వహించారు. ఆ పిదప ఎన్నో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలనిర్వహణ జరిగాక, రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. పొట్ట కుతి క్సోం హైదరాబద్’లో కాలు పెట్టిన ఆయన ...ఈరోజు ప్రపంచానికి సమతా మూర్తి ని అందించారు.
జై శ్రీమ్మన్నారాయణ ... జై.. జై .. శ్రీమన్నారాయణ ..