కూర్చొన్న సీటులోంచి జేసీని లేపేశారు..
posted on Jul 9, 2017 11:02AM
.jpg)
గత నెల 15న విశాఖ ఎయిర్‌పోర్టులో విమాన సిబ్బందితో గొడవ పడటం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని వెంటాడుతోంది. ఇదే విషయంపై ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఆయన నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. టికెట్ తీసుకుని స్పైస్‌జెట్ విమానంలో ఎక్కి కూర్చొన్నారు. అయితే విశాఖ విమానాశ్రయంలో మనోడు చేసిన రచ్చకి ఆయనపై నిషేదం ఉందని తెలుసుకున్న సిబ్బంది జేసీని కుర్చీలోంచి లేపి కిందకి దించివేశారు. ఆ ఘటన జరిగిన తర్వాత విజయవాడ వెళ్లేందుకు ట్రూజెట్ విమాన టికెట్ తీసుకున్నారు. అయితే ఆయన ఎయిర్‌పోర్టుకు వెళ్లకముందే ట్రూజెట్ ఎయిర్‌వేస్ మేనేజర్ జేసీకి ఫోన్ చేసి మీపై నిషేధం ఉన్నందున తాము తీసుకెళ్లలేమని వివరించినట్లు సమాచారం. దీంతో జేసీ చేసేది ఏం లేక ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.