జీఎస్టీ పై డౌట్సు ఉన్నాయా..? యాప్ వచ్చేసింది..
posted on Jul 8, 2017 5:54PM

దేశవ్యాప్తంగా జీఎస్టీ బిల్లు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 'ఒకే దేశం ఒకే పన్ను' ఉండాలన్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం జీఎస్టీ బిల్లును అమల్లోకి తెచ్చింది. అయితే జీఎస్టీ బిల్లు అయితే అమల్లోకి వచ్చింది కానీ.. జీఎస్టీ పైన ఉన్న అనుమానాలు మాత్రం ఇంకా తీరలేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీపై సందేహాలు, అనుమానాలు తీర్చేందుకు హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది. ఆస్క్ జీఎస్టీ పేరుతో ట్విట్టర్‌లో సందేహాలను తీరుస్తోంది. అలాగే దూరదర్శన్ ద్వారా ఆరు రోజుల పాటువివిధ అంశాలపై అవగాహన, ప్రశ్నోత్తరాలను నిర్వహిస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా 60 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ పరిధిలో వివిధ పన్నులరేట్లపై సందేహాలను నివృత్తి చేసేందుకు మొబైల్ యాప్‌ను శనివారం ప్రారంభించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఒక 'జీఎస్ఎం రేట్స్ ఫైండర్' పేరుతో ఆ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. దీని ద్వారా గూడ్స్, సర్వీసు టాక్స్ వివిధ పన్ను రేట్లను తెలుసుకోవచ్చు. అన్నిఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా ఈ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.