జార్ఖండ్ మాజీ సీఎం శిబూసొరేన్ కన్నుమూత
posted on Aug 4, 2025 10:16AM

జార్ఖండ్ మాజా ముఖ్యమంత్రి శిబూ సొరేన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ( ఆగస్టు 4) ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన జూన్ నెలలో ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచీ ఆక్కడే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు హేమంత్ సొరేన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
జార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన శిబు సొరేన్.. ఆ లక్ష్య సాధన కోసమే జార్ఖండ్ ముక్తిమోర్జా పార్టీని స్థాపించారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు సార్లు పని చేశారు. 2004 నుంచి 2006 వరకూ కేంద్ర మంత్రిగా పని చేశారు.
శిబు సోరెన్ మృతి పట్ల జార్ఖండ్ ముఖ్యమంత్రి, శిబు సొరేన్ కుమారుడు హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురూజీ మనను విడిచి వెళ్లారంటూ సామాజిక వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. తన తండ్రి మరణంతో తాను శూన్యంలో ఉన్నానని పేర్కొన్నారు.