కుంకీ ఏనుగులు పని మొదలెట్టేశాయ్!
posted on Aug 4, 2025 10:29AM

ఆంధ్రప్రదేశ్ లో కుంకీ ఏనుగులు పని మొదలు పెట్టేశాయి. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పంటపొలాలు, గ్రామాలపై ఏనుగుల గుంపు పడి విధ్వంసం సృష్టిస్తుండటం, కొన్ని సార్లు ప్రాణనష్టం కూడా కలిగిస్తున్న నేపథ్యంలో ఏనుగుల బెడద నుంచి గ్రామాలను, పొలాలను కాపాడే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించారు.
ముఖ్యంగా ఏనుగుల బెడద చిత్తూరు జిల్లాను వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కుంకీ ఏనుగులు తమ తొలి ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించాయి. చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ గస్తీ నిర్వహించిన కుంకీ ఏనుగులు పలమనేరు ప్రాంతంలో తిరుగుతున్న ఎనిమిది ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించాయి.