జేడీ.. 'జనధ్వని' పార్టీ

 

అసలు పేరు వి.వి.లక్ష్మీనారాయణ అయినప్పటికీ తెలుగు ప్రజలకు మాత్రం జేడీ లక్ష్మీనారాయణగానే సుపరిచితుడు. మహారాష్ట్ర క్యాడర్‌ కి చెందిన లక్ష్మీనారాయణ సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా వైసీపీ అధినేత జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్‌, గాలి జనార్దన్‌రెడ్డి అక్రమాలపై కేసులను దర్యాప్తు చేయటం ద్వారా వెలుగులోకి వచ్చారు. కొద్ది నెలల కిందట స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన లక్ష్మీనారాయణ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ గ్రామీణ సమస్యలపై, ముఖ్యంగా రైతుల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నారు. కళాశాలలను సందర్శించి విద్యార్థులను చైతన్య పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వినిపించాయి. అందరి ఊహాగానాలకు తెరదింపుతూ తన రాజకీయ రంగ ప్రవేశంపై ఓ క్లారిటీ ఇచ్చేసారు. లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టనున్నారు.


ఇన్నాళ్లు రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలు వినిపించగా తాజగా పార్టీ పేరుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘జేడీ’గా తెలుగు ప్రజలకు సుపరిచితుడు అయ్యారు కాబట్టి పార్టీ పేరు కూడా జేడీ అని పలికేలా  ‘జన ధ్వని’  అని పెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. వందేమాతరం అనే పేరు సైతం ప్రచారంలో ఉంది. లక్ష్మీనారాయణ సన్నిహిత వర్గాలు మాత్రం ఏ పేరునూ ధ్రువీకరించటం లేదు. అలాగని వీటిని ఖండించటమూ లేదు. జేడీ పేరు పైనే లక్ష్మీనారాయణ ఆసక్తి చూపుతున్నట్లు భావిస్తున్నారు. ఈనెల 26వ తేదీన ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన చేసేందుకు హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌ వేదిక కానున్నట్లు సమాచారం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu