జగన్ తెలంగాణను లైట్ తీసుకుంటున్నారా?
posted on Nov 6, 2014 9:21AM

ఏపీ, తెలంగాణ ప్రజలిద్దరూ తనకు సమానమేనని గట్టిగా చెప్పే జగన్ ఇప్పుడు తెలంగాణను మరిచిపోయారా? తెలంగాణలో పార్టీని ఆయన లైట్ తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు కానీ.. ఎన్నికల తర్వాత కానీ జగన్ ఏనాడూ తెలంగాణపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. పార్టీ సీనియర్ నేతలంతా రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోతున్నా రియాక్టవ్వలేదు. పోనీ క్యాడర్ కు ఏదైనా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు. ఆ మధ్య ఖమ్మం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేనే టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. అయినా జగన్ నుంచి స్పందన లేదు. తెలంగాణలో అసలేం చేయదలుచుకున్నారని ఆ మధ్య క్యాడర్ నిలదీస్తే.. కొంతకాలం కింద హైదరాబాద్ లో నామమాత్రంగా మీటింగ్ పెట్టారు. ఇక నుంచి తెలంగాణపై శ్రద్ధ పెడుతామని బీరాలు పలికారు. తీరా ఇప్పుడవన్నీ మరిచిపోయారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఉందా లేదా అన్నది కూడా డౌట్ గా మారింది.
తెలంగాణలో వైసీపీ వీక్ అవ్వడానికి జగనే మెయిన్ రీజనంటున్నారు ఆ పార్టీ చెందిన మాజీ నేతలు. ఎందుకంటే జగన్ ఏదో చేసేస్తారని పార్టీలోకి వస్తే ఆయన మాత్రం నేతలకు అందుబాటులో ఉండరన్న విమర్శ ఉంది. ఎంతసేపు ఏపీలో ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. ఓదార్పు యాత్ర అంటూ హడావిడి తప్ప తెలంగాణను ఆయన పట్టించుకోరని మండిపడుతున్నారు నేతలు. కనీసం తెలంగాణ బడ్జెట్ పై రియాక్ట్ అవ్వడానికి కూడా జగన్ కు టైమ్ లేదా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ తెలంగాణ నేతలు. ఎందుకంటే తెలంగాణ బడ్జెట్ పై ప్రతిపక్షాలన్నీ మండిపడుతుంటే.. వైసీపీ అధినేత జగన్ నుంచి కనీసం రియాక్షనే లేదు. ఇలాంటి నేత పార్టీని ఎలా లీడ్ చేస్తారన్న ఆగ్రహం వైసీపీ తెలంగాణ నేతల్లో వ్యక్తమవుతుంది. జగన్ ఇకనైనా మారకపోతే వైసీపీకి కష్టమేనంటున్నారు నేతలు. తెలంగాణలో ఎలాగూ పార్టీ వీకైపోయింది. ఇకనైనా జగన్ మారకపోతే ఏపీలోనూ అదే పరిస్థితి ఎదురవ్వడం ఖాయమని ఆ పార్టీకి చెందిన నేతలే గుసగుసలాడుకుంటున్నారు.