నేడు డిల్లీ వెళ్లనున్న చంద్రబాబు నాయుడు
posted on Nov 6, 2014 8:20AM
.jpg)
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో డిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. డిల్లీలో ఆయన భారతీయ పారిశ్రామిక సమాఖ్య సమావేశంలో పాల్గొన్న తరువాత భారత ఆర్ధిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ గురించి వివరించి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. తరువాత ఆర్ధిక, వ్యవసాయ, విద్యుత్, జలవనరులు తదితర శాఖల కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు విడుదలకు, ప్రాజెక్టుల క్లియరెన్స్ గురించి చర్చిస్తారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఇవే అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ప్రభుత్వం పట్ల కనబరుస్తున్న విద్వేష వైఖరి గురించి, తత్ఫలితంగా తలెత్తుతున్న వివాదాల గురించి కేంద్రమంత్రులకు, ప్రధానికి వివరించవచ్చని సమాచారం.