మరో కొత్త యాత్రకు రెడీ అవుతున్న జగన్
posted on Sep 16, 2015 12:08PM
.jpg)
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. హోదా ఉద్యమంలోకి యువతను లాగాలనుకుంటున్న జగన్... యూనివర్సిటీల్లో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 26న గుంటూరులో తలపెట్టిన దీక్షకు ముందే, అన్ని యూనివర్సిటీలను చుట్టేయాలని షెడ్యూల్ రెడీ చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి...నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీతోపాటు అన్ని విశ్వవిద్యాలయాలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. విద్యార్ధుల మద్దతు ఉంటేనే, తాను చేపట్టే హోదా దీక్ష సక్సెస్ అవుతుందని భావిస్తున్న జగన్, స్వయంగా వెళ్లి మద్దతు కోరాలనుకుంటున్నారు. మరోవైపు 13 జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించడంతోపాటు, పెద్దఎత్తున యువతను దీక్షాస్థలికి తీసుకురావాలని పార్టీ నేతలకు జగన్ ఆదేశించారట.
మరి జగన్ ఆశిస్తున్నట్లుగా విద్యార్ధి లోకం...కదిలి వస్తుందో లేదో చూడాలి