కోర్టు మొట్టికాయలతో దిగొచ్చిన జగన్ సర్కార్!

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కూడా జగన్ సర్కార్ విపక్ష నేతలపై ఉన్న కేసుల వివరాలను అందజేయకుండా వేధిస్తున్న నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నామినేషన్‌ పత్రాల దాఖలు సమయంలో తమపై ఉన్న కేసుల వివరాలను కూడా అభ్యర్థులు అందజేయాల్సి ఉంది. వారిచ్చే సమాచారంలో ఏ ఒక్కటి మిస్‌ అయినా వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది.

ఇదే విషయాన్ని పేర్కొంటూ  మార్చి ఒకటో తేదీన డీజీపీకి లేఖ రాసినప్పటికీ డీజీపీ స్పందించకపోవడంతో చంద్రబాబు తదితరులు కోర్టును ఆశ్రయించారు.  ఏపీ సర్కార్ విపక్ష నేతలపై వేధింపులలో భాగంగా ఆ కేసుల వివరాలను కోరినా కూడా విపక్ష నేతలకు అందజేయడంలేదంటూ వారు హైకోర్టును ఆశ్రయించారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షుడుఅచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నారాయణ, అయ్యన్నపాత్రుడు తదితరులు కోర్టును ఆశ్రయించిన వారిలో ఉన్నారు.

వారి పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రజాప్రతినిథులపై ఉన్న కేసుల వివరాలను వారికి అందజేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ నెల 16లోగా కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశిస్తూ కేసులు సోమవారం (ఏప్రిల్ 16)కు వాయిదా వేసిన సంగతి తెలసిందే.   కోర్టు ఆదేశాలతో దిగివచ్చిన ప్రభుత్వం నేతలపై ఉన్న కేసుల వివరాలను వారి ఈమెయిల్ కు పంపినట్లు సోమవారం (ఏప్రిల్ 16) కోర్టుకు తెలిపింది.  దీంతో కోర్టు  ఒకసారి మెయిల్ చెక్ చేసుకుని ఈ మధ్యాహ్నంలోగా ఆ వివరాలు వచ్చాయో లేదో చెప్పాలని పిటిషనర్‍ లు తరపున న్యాయవాదులను ఆదేశించింది.