శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు జైలు

వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించింది.  శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు ఏడాదిన్నర జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.  

1998 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు పది మందికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆ పది మందితో తోట త్రిమూర్తులు కూడా ఒకరు. సుదీర్ఘంగా  విచారణ సాగిన ఈ కేసులో 28 ఏళ్ల తరువాత నిందితులకు శిక్ష పడింది.

ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కోర్టు జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పు పట్ల దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.