జగన్ కాపీ పేస్ట్ కహానీ!
posted on Sep 25, 2025 12:20PM

జగన్ డిజిటల్ బుక్ తెరవడంతో ఆయనకు ఏదీ స్వయంగా తయారు చేయడం రాదని క్రిస్టల్ క్లియర్ గా అర్ధమై పోయింది. ఆయన పెద్ద సంక్షేమ రూపశిల్పి కూడా ఏమీ కాదు. గతంలో తన తండ్రి ప్రవేశ పెట్టిన వాటికే కాస్త సొబగులు అద్దారాయన. అది కూడా ఏమంత ఒరిజినల్ కాదు. ఇదంతా ఎన్టీఆర్ సెట్ చేసిన ట్రండ్. ఇప్పుడు చూస్తే జగన్ తన వెల్ఫేర్ ఇతరత్రా పథకాల సోర్స్ మొత్తం లోకేషే అనడంలో ఎలాంటి అనుమానమే లేదు..
ఔను నిజమే.. మీరు చదువుతున్నది నిజం. జగన్ కి కొత్త ఆలోచన ఏదీ రాదు. ఒకప్పుడు లోకేష్ కార్యకర్తలకు జీతాలు అనే కాన్సెప్ట్ నే తర్వాత జగన్ మక్కీకి మక్కీ కాపీ కొట్టి దాన్ని వాలంటీర్లుగా మార్చారు. కావాలంటే చూడండి.. ఆయన అపాయింట్ చేసిన చాలా మంది వాలంటీర్లలో అత్యధిక శాతం మంది రెడ్లే కనిపిస్తారు. ఇప్పుడు వాళ్లకు కూడా మొండి చేయి ఇచ్చారు. అదే లోకేష్ ఒక వైసీపీ కార్యకర్తను కూడా ఆదుకుంటూ.. ఆయన ఆరోగ్య ఖర్చులు మొత్తం తాము భరిస్తామన్న భరోసా ఇచ్చారు. మానవత్వం చాటుకున్నారు. తర్వాత డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్. ఇవి స్టాన్ ఫర్డ్ లో చదివి, వరల్డ్ బ్యాంక్ లో పని చేసిన అనుభవజ్ఞుడైన లోకేష్ బ్రైన్ చైల్డ్. ఈ కాన్సెప్ట్ ద్వారానే జగన్ చాలా వరకూ నేరుగా జనం ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఈ విషయం చాలా మందికి తెలీదు. లోకేష్ కూడా ఇదంతా నాది అన్న కోణంలో ఏదీ చెప్పుకోరు.
ఇప్పుడు చూస్తే రెడ్ బుక్. మాములుగా ఒక మాట అంటుంటారు. నువ్వు చేసిన పనిని ఇతరులు కాపీ కొడితే నువ్వొక ట్రెండ్ సెట్టర్ అని. ఎగ్జాట్ గా లోకేష్ కూడా అంతే. ట్రెండ్ ఫాలో కాడాయన- సెట్ చేస్తారని అంటారు చాలా మంది. మీరు కావాలంటే చూడండి.. లోకేష్ రెడ్ బుక్ ఎంత ఫేమస్ అంటే, పొరుగు రాష్ట్రం నుంచి కవిత కూడా తాము పింక్ బుక్ రాస్తామని అన్నారు. ఇక జగన్ అయితే ఓడిపోయిన తొలి నాళ్లలోనే తాము బ్లూ బుక్ రాస్తామన్నారు.
ఇప్పుడు చూస్తే బ్లూ అంటే తనను కాపీ క్యాట్ అంటారని భావించారేమో.. దాన్ని డిజిటల్ బుక్ గా మార్చారు. కానీ కాపీ కాపీ కాకుండా పోతుందా? జగన్ ఏదీ ఒరిజినల్ కాదు. అంతా డూపే అన్న ముద్ర పడే తీరుతుందని అంటున్నారు చాలా మంది వైసీపీ వర్గాల వారు.