జగన్ కు చేదు అనుభవం... ‘జగన్‌ గో బ్యాక్‌’ బ్యానర్లు..

 


వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కు చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు జగన్ అమరావతి ప్రాంతంలో పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ  ‘జగన్‌ గో బ్యాక్‌’అంటూ కురగల్లులో రైతులు బ్యానర్లు కట్టారు. రైతుల్లో విషబీజాలు నాటేందుకే జగన్‌ అమరావతిలో పర్యటిస్తున్నారని రాజధాని ప్రాంత రైతుల పేరిట బ్యానర్లు ఏర్పాటుచేశారు. మురోవైపు మంగళగిరి మండలంలోని కురగల్లుతో పాటు ఎర్రబాలెం గ్రామాల్లో జగన్ పర్యటనను నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు, రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు ప్ల‌కార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. రైతుల‌ నిరసనల మధ్యనే జగన్ త‌న ప‌ర్య‌ట‌న‌ను కొన‌సాగించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu