దేశ వ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు
posted on Mar 11, 2025 11:29AM
దేశ వ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలలో ఐటి దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో బాటు చెన్నయ్, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ నగరాల్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీచైతన్య యాజమాన్యం పన్నులు కట్టడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రత్యేక సాప్ట్ వేర్ రూపొందించి ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం ఐటీశాఖకు కోట్లాది రూపాయయలు ఎగబెట్టినట్టు సమాచారం.
దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థలు నడుపుతుంది. యాజమాన్యం అక్రమ లావాదేవీలు జరుపుతున్నట్టు సమాచారంతో ఐటీ శాఖ ఏక కాలంలో దాడులు జరుపుతోంది. సోమవారం నుంచి ప్రారంభమైన ఐటీ దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. ఐటీ అధికారుల సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.