ఐటీ సీఇఓల సదస్సులో పలు ఒప్పందాలు
posted on Sep 29, 2014 3:17PM
.jpg)
విశాఖపట్టణంలో జరుగుతున్న ఐటీ కంపెనీల సీఇఓల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వానికి - విప్రో, టెక్ మహీంద్రా, సమీర్ తదితర సంస్థలతో కీలకమైన ఒప్పందాలు జరిగాయి. 400 కంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణన్ హాజరయ్యారు. మధురవాడ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ అభివృద్ధికి అవగాహన ఒప్పందం, మధురవాడ ఐటీ సెంటర్ అభివృద్ధికి మాబ్ ఎంఈ / స్టార్ట్ అప్ విలేజ్‌తోతో ఒప్పందం, చిరు వ్యాపారులు, మహిళలు ఇంటర్నెట్ ద్వారా లబ్ధి పొందేందుకు వీలుగా గూగుల్ సాయం, డిజిటల్ ఎ.పి. ప్రాజెక్టులో భాగంగా గూగుల్ ఇండియాతో అవగాహన ఒప్పందం వంటి ఒప్పందాలు ఈ సదస్సులో జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ఐటీ సలహాదారు సత్యనారాయణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే శక్తి చంద్రబాబుకు ఉందని అన్నారు.