ధర్మశాల నుండి అహ్మదాబాద్‌కు ఐపీఎల్ మ్యాచ్ మార్పు

 

 

ఐపీఎల్ -2025లో ఈ నెల 11న ధర్మశాలలో జరిగే ముంబై ఇండియన్స్- పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ వేదిక మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం (మే 11) ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో వేదికను ధర్మశాల  నుంచి అహ్మదాబాద్‌కు మార్చారు. విషయాన్ని గుజరాత్ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ అనిల్‌ పటేల్‌ తెలిపారు. ఈ మ్యాచ్‌ ను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. మేం అంగీకరించాం. ఈ రోజు ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు నగరానికి చేరుకుంటారు. 

పంజాబ్‌ జట్టు ప్రయాణ ప్రణాళికలు ఇంకా తెలియరాలేదు’’ అని పటేల్‌ వెల్లడించారు. ధర్మశాల ఎయిర్‌పోర్టు మూసివేత కారణంగానే ముంబయి జట్టు అక్కడకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇక, ధర్మశాల వేదికగా నేడు పంజాబ్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ యధావిధిగా జరగనుందని ఐపీఎల్‌ నిర్వాహకులు వెల్లడించారు. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే రెండు జట్లు అక్కడకు చేరుకోవడంతో ప్రయాణ సమస్య తలెత్తలేదు. కానీ, సాయంత్రం సమయంలో మ్యాచ్‌లో ఫ్లడ్‌లైట్ల వినియోగం భద్రతాపరంగా సమస్యగా మారింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొనగా.. ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu