ఆపరేషన్ సిందూర్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబ్దుల్ రవూఫ్ హతం

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ ఆర్మీ బహవల్ పూర్ లోని ఉగ్ర స్థావరంపై జరిపిన దాడిలో జైషే ఆ మహ్మద్ సంస్థకు చెందిన కరుడుగట్టన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ మరణించాడు. ఈ దాడిలో జైషే కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాాడిలో మరణించిన అబ్దుల్ రవూఫ్ అజార్ జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరుడే. అబ్దుల్ రవూఫ్ కందహార్‌   విమానం హైజాక్ లో కీలక పాత్ర పోషించాడు. ఆ విమానం హైజాక్ ద్వారానే అప్పటికి భారత్ లో ఖైదులో ఉణ్న మసూద్ అజార్ ను పాక్ ఉగ్రవాదులు విడిపించుకుపోయారు.

 జమ్మూకాశ్మీర్‌ ఉగ్రవాద కార్యకలాపాల్లో రవూఫ్ కీలక పాత్ర పోషించాడు. మోస్ట్ వాంటెడ్  ఉగ్రవాదిగా ఉన్న రవూఫ్ ఆపరేషన్ సింధూరలో భాగంగా భారత్ సైన్యం జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం (మే 7) మరణించాడు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీతో పాటు.. పాకిస్థాన్ కూడా ధృవీకరించింది. 

కాగా అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియలు బహవల్పూర్ లో జరిగాయి. ఈ అంత్యక్రియలు పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఉన్నత స్థాయి అధికారులు, ఐఎస్ఐ అధికారులు హాజరయ్యారు. ఇలా ఉండగా.. అబ్దుల్ రవూఫ్ అజార్  మరణం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్‌వర్క్‌కు, ముఖ్యంగా జైషే మహమ్మద్ సంస్థకు కోలుకోలేని దెబ్బ అని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu