పాక్ సైనికులపై బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ మెరుపు దాడి.. 14 మంది మృతి

పాకిస్థాన్ పరిస్థితి చేతి దగ్గరకొస్తే చేతి దెబ్బ, కాలిదగ్గరకొస్తే కాలి దెబ్బ అన్నట్లుగా తయారైంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పబ్బం గడుపుకుంటున్న పాకిస్థాన్ కు ఇప్పుడు అదే ఉగ్రవాదం చుక్కలు చూపిస్తోంది. దేశంలోని అవ్యవస్థ, ఆర్థిక సంక్షోభం నుంచి తమ దేశ ప్రజల దృష్టి మరల్చడానికి భారత్ బూచి చూపిస్తూ, భారత్ లో ఉగ్రదాడులకు తన వంతు ప్రోత్సాహం, సహాయం, సహకారం అందిస్తూ వస్తున్న పాకిస్థాన్ కు భారత్ ఆపరేషన్ సిందూర్ పేర దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆ దేశ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిపి ధ్వంసం చేసింది.

అదే సమయంలో పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, పాక్ సేనలు లక్ష్యంగా దాడులు ముమ్మరం చేసింది. గురువారం (మే 8) ఒక్క రోజే  బలూలచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన రెండు వేర్వేరు దాడులలో 14 మంది పాక్ సైనికులు హతమయ్యారు.  బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్  పాక్ ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీ బాంబు పేల్చింది. బలూచిస్థాన్ లోని ముచ్కుంద్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 12 మంది పాక్ సైనికులు మరణించారు.

అలాగే బలూచిస్థాన్ లోనే జరిగిన మరో దాడిలో ఇద్దరు పాక్ సైనికులు చనిపోయారు. ఇక పాకిస్థాన్ లోని కీలక నగరమైన లాహోర్ వరుస బాంబులతో దద్దరిల్లిపోయింది. లాహోర్ లోని సైనిక విమానాశ్రయానికి అతి సమీపంలో వరుస పేలుళ్లు సంభవించాయి. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులే ఈ బాంబుదాడులకు పాల్పడినట్లు భావిస్తున్నాయి. ఈ వరుస పేలుళ్లతో అప్పమత్తమైన భద్రతా బలగాలు లాహోర్ విమానాశ్రయాన్ని మూసివేసి, నగరంలో హై అలర్ట్ ప్రకటించారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu