ఏటూరు నాగారం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ

ఏటూరు నాగారం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ ఏటూరు నాగారం  సమీపంలోని  చల్పాక ఆటవీ ప్రాంతంలో  ఆదివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.  ఆ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ ఘటనపై హైకోర్టులో విచారణ జరపాలని పిటిషన్ దాఖలైంది. మావోయిస్టుల ఎన్ కౌంటర్ వెనక కుట్ర జరిగిందని, మావో యిస్టుల ఆహారంపై విషప్రయోగం జరిగిందని ఆ పిటిషన్ లో పేర్కిన్నారు. ఈ పిటిషన్ పై విచారణ  మ్గళవారం ప్రారంభ మైంది.  మల్లయ్య మృదదేహాన్ని వారం రోజుల పాటు మార్చురీలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది.  మల్లయ్య పోస్టు మార్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని పేర్కొంది.  మిగతా మావోయిస్టుల మృత దేహాలను  కుటుంబసభ్యులకు అప్పగించాలని  ఉత్తర్వులు జారీ చేసింది.  విచారణను గురువారానికి వాయిదా వేసింది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu