సొంతగానే తెలంగాణ ఇంటర్ పరీక్షలు

 

ఇంటర్మీడియట్ పరీక్షలను సొంతగా నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక షెడ్యూలు తయారు చేయాలని ఇంటర్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశం మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక షెడ్యూలును తయారు చేస్తోంది. ఇంటర్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌తో కలసి ఉమ్మడిగా నిర్వహించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదిలా వుండగా, ఇంటర్మీడియట్ పరీక్షలు 2015 మార్చి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగానే జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం రోజున తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని, దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఆయన ప్రతిపాదనను తిరస్కరించినట్టు అయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu