విశాఖకు ఐఎన్ఎస్ నీలగిరి

తూర్పు నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలో తయారైన యుద్ధనౌక  ఐఎన్ఎస్ నీలగిరిని ఈ ఏడాది జనవరి 15న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే.

ఈ యుద్ధ నౌకను  ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్ శ్రేణిలో నిర్మించారు. ఈ పద్ధతిలో నిర్మించిన తొలి నౌక ఇది. ఈ నౌకలో వినియోగించిన  స్టెల్త్ టెక్నాలజీ  కారణంగా ఐఎన్ఎస్ నీలగిరి శత్రువు రాడార్‌లలో కనిపించదు. ఈ నౌక విశాఖ తీరానికి చేరుకుంది. ఇప్పటికే విశాఖపట్నం తూర్పు తీర నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ నీలగిరి రాక విశాఖ నగర రక్షణకు అదనపు అలంబనగా ఉంటుంది.  సంప్రదాయ పద్ధతిలో ఐఎన్ఎస్ నీలగిరికి తూర్పు నౌకాదళం ఘనంగా స్వాగతం పలికింది.